పార్వతీపురం, విజయనగరం జిల్లాల జనసేన పార్టీ నాయకులతో నేడు విజయనగరంలో జనసేన నేత నాగబాబు సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… పొత్తులపై ఆలోచించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. మెగాస్టార్ చిరంజీవికి సినిమాలంటే ఫ్యాషన్, ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. చిరంజీవి మద్దతు ఎప్పటికీ జనసేనకే ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల వలసల నిరోధానికి పవన్ కల్యాణ్ వద్ద ప్రణాళిక ఉంది. జనసైనికుల్లో విభేదాలు పరిష్కరించుకుని ముందుకెళ్తామన్నారు.