Site icon TeluguMirchi.com

నాగ్ వెనక్కి తగ్గాడా?

nagకొన్నాళ్ల క్రితం కింగ్ నాగార్జున రాజకీయాల్లోకి వస్తాడని బలంగా వినిపించింది. జగన్, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడని, విజయవాడ నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తాడని కూడా వదంతులు వినిపించాయి. ఇటు కిరణ్, అటు జగన్ ఇద్దరూ నాగార్జునకు సన్నిహితులే. అటు చిరంజీవితో, ఇటు నిమ్మగడ్డతో నాగార్జునకు వ్యాపార సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజకీయాల్లో కాలుపెట్టేది ఖాయమన్న వార్తలు వినవచ్చాయి. అయితే అంతలోనే పలుపక్షాల నుంచి నాగ్ పై దాడి ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారం సిబిఐ గుమ్మంలోకి వెళ్లే సూచనలు కనిపించాయి. బహుశా వీటి ప్రభావమే కావచ్చు. ఇప్పుడు నాగ్ తాను రాజకీయాల్లోకి వెళ్లేది లేదని పదే పదే చెబుతున్నారు. స్వతహాగా అక్కినేని కుటుంబం వివాదాలకు దూరంగా ఉండి, హాయిగా జీవితాన్ని అనుభవించడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇకపై నాగ్ కూడా ఇదే బాటలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version