Site icon TeluguMirchi.com

నాదెండ్ల రిసెర్చ్.. !!

Nadendla Manoharతెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ తీరు ఏలా ఉండబోతోంది.. ? ఏయే విషయాలపై సభలో చర్చించాలి.. ? చర్చ సమయంలో ఎవరెవరికి ఎంత సమయం కేటాస్తారు.. ? ఇలా సమాధానం తెలియని ప్రశ్నలెన్నో. ఇందులో సమాధానం తెలసిన ప్రశ్నలు కొన్ని వున్నా.. స్పష్టత లేని ప్రశ్నలే ఎక్కువ. ఈ విషయాలపై మన నాయకులకు స్పష్టత లేకపోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అనుకోండి.

తాజాగా, స్వీకర్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాలపై అధ్యయనం చేయడానికి లక్నో బయలుదేరి వెళ్లాడు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చ తీరును తెలుసుకోవడానికి లక్నో ఎందుకంటారా.. ? అదేనండీ.. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చ జరిగిన తీరుపై నాదెండ్ల అధ్యయనం చేయనున్నారు. ఆ సమయంలో.. ఉత్తరప్రదేశ్ శాసన సభ అనుసరించిన విధానాన్ని ఓ పరిశీలిస్తారట మన స్వీకర్.

వచ్చే నెల 3వ తేది నుండి టీ-బిల్లుపై హాట్ హాట్ చర్చకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈలోగా మన స్వీకర్ చర్చ జరపాల్సిన తీరుపై జర అధ్యయనం చేసి..  సభలో అవే విధానాలను అనుసరించనున్నాడన్న మాట.

Exit mobile version