టోలిచౌకిలోని నివాసం ఉండే విశాల్ సింగ్ మణికొండకు చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని విశాల్ సింగ్ ని మందలించారు. మందలించిన విశాల్ సింగ్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో యువతి సోదరుడు శ్యామ్ మరోసారి మాట్లాడేందుకు పిలిచాడు. విశాల్ సింగ్ అసభ్యకరంగా మాట్లాడంతో శ్యామ్, విశాల్ సింగ్ మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో శ్యామ్, విశాల్ సింగ్ ఒకరిపై ఘర్షణకు దిగడంతో అతని స్నేహితులు శ్యాంపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయలైన శ్యామ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు