నేటి సమాజంలో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, స్నేహితులకంటే చివరకు ప్రాణాలకంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత వుంది. ఆర్దిక వ్యవహారాలు మనుషుల చేత ఎన్నో దారుణాలు చేయిస్తోంది. అలా కేవలం రూ.500 అప్పు విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ఖమ్మం నగరంలోని బికే బజార్ కు చెందిన బొల్లోజు నాగరాజు, భాస్కర్ లు ఇద్దరూ గతంలో పెయింటింగ్ వర్క్ చేసేవారు. గత కొన్ని రోజుల క్రితం నాగరాజు, భాస్కర్ కు రూ.500 అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు భాస్కర్.. నాగరాజుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.