ముంబయి,ఢిల్లీ విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు 100మందికి పైగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు,కేంద్ర పౌరవిమానయాన శాఖకు తాజా నిర్ణయం గురించి కేంద్ర పారామిలటరీ తెలియజేసింది. సామాను స్కానింగ్, భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదనే ఈ నిర్ణయం అని తెలిపింది. ‘‘క్రిస్మస్, నూతన సంవత్సరం దృష్ట్యా రద్దీని తగ్గించడానికే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు