జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న ములుగు ఫారెస్ట్ కాలేజీ

అనేక ప్రత్యేకతలతో ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) కు మరో గుర్తింపు దక్కింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా – ఒక పచ్చని విజేత (One District – One Green Champion) అవార్డును సాధించింది.

జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో జిల్లా నుంచి ఒక సంస్థను పరిశుభ్రత, పచ్చదనం పెంపు నిర్వహణ బాగా చేస్తున్న వాటిని గుర్తించారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ అవార్డును దక్కించుకుంది. ఫారెస్ట్ కాలేజీకి జాతీయస్థాయి గుర్తింపుకు కారణమైన డీన్, సిబ్బంది, విద్యార్థులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.