2019 పార్లమెంటు ఎన్నికల్లో దారుణ పరాజయం పాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేయడంను ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేక పోయారు. పలువురు ముఖ్య నేతలు ఆయన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. కాని ఆయన మాత్రం పార్టీ అధ్యక్షుడిగా తాను కొనసాగలేను అంటూ తేల్చి చెప్పాడు. దాంతో పార్టీ అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐసీసీ చీప్ పదవి అంటే నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నట్లే. అందుకే ఆ పదవిని చేపట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు.
ఎట్టకేలకు కాంగ్రెస్ చీప్ పదవిని చేపట్టేందుకు ఒక వ్యక్తి దొరికాడు. సోనియా గాంధీకి అత్యంత విధేయుడిగా ఉండటంతో పాటు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ముకుల్ వాస్నిక్‌ను పార్టీ కొత్త చీప్‌గా ఎనుకోబోతున్నారు. నేడు సోనియా గాంధీ ఇంట్లో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరాఠా నాయకుడు అయిన ముకుల్ వాస్నిక్ కేంద్ర మంత్రిగా పని చేయడంతో పాటు పలు పార్టీ పదవులు కూడా నిర్వహించారు. ఈయన పార్టీని గాడిలో పెట్టడంతో పాటు, గాంధీ కుటుంబంకు విధేయుడిగా ఉంటాడని ఈయనకు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.