ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ఆ బోర్డులో ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. ముఖేశ్ అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డులో స్థానం కల్పించారు. ఈ చర్య భారతదేశపు అత్యంత విలువైన కంపెనీకి వారసత్వ ప్రణాళికగా పరిగణించబడుతుంది. అనంత్‌తో పాటు ఇషా, ఆకాష్‌ల నియామకాలను కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అధికారికంగా ధృవీకరించడానికి రిలయన్స్ బోర్డు వార్షిక సాధారణ సమావేశానికి ముందు సమావేశమైంది.
ఈ నిర్ణయం సంస్థ చేసిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలియజేయబడింది. నీతా అంబానీ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఆమె అన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సమావేశాలకు బోర్డుకు శాశ్వత ఆహ్వానితురాలుగా హాజరవుతారు. నిజానికి గత కొన్నేళ్ల నుంచి ఈ ముగ్గురూ కంపెనీలో వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిటేల్, డిజిటల్ సర్వీసులు, ఎనర్జీ రంగాలకు చెందని వ్యాపారాన్ని చూసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ అనుబంధ కంపెనీల బోర్డుల్లోనూ ముకేశ్ పిల్లలు ఉన్నారు.