తెలంగాణ సమగ్రాభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు,మరియు సర్పంచ్ ల గౌరవ వేతనాలను 30% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6వేల 500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మండలాధ్యక్షులకు వేతనం ప్రస్తుతం రూ.10వేలు ఉండగా, ఇక నుంచి రూ.13వేలు అందుకుంటారు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గార్లకు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.