మోడీ జుట్టు పట్టుకుని అడుగుతున్నట్లుగా కనిపించేలా సింబాలిక్‌గా మోడీ ఫొటో తలపై భాగంలో పట్టుకున్నాడు. అంటే మోడీ జుట్టు పట్టుకుని అడుగుతున్నట్లుగా భావించవచ్చు. ఇతర ఎంపీలు రైల్వే జోన్ కోసం, పొత్తు ధర్మంను నిలుపుకోవాలని, ఏపీని కాపాడాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని ఉన్నారు. ఎంపి శివ ప్రసాద్ మాత్రం మోడీ ఫొటోను అది జట్టు పట్టుకుని నిరసన తెలియజేశారు. మొత్తానికి ఏపీ ఎంపీలు కాస్త తీవ్ర స్వరంతోనే తమకు న్యాయం చేయాలని కేంద్రం వద్ద డిమాండ్ చేస్తున్నారు. మరి ఎంపీల పోరాటం సక్సెస్ అయ్యేనా చూడాలి.