కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఈ కోత ఉంటుందంటూ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ మేరకు 1954 చట్టాన్ని సవరించింది. అదే విధంగా, ఎంపీలకు ఇచ్చే లాడ్స్ (ఎంపీ లాడ్స్)ను (2020-21 , 2021-22) రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ మీడియాకు వెల్లడించారు.