బడ్జెట్లో అన్యాయం జరిగింది అంటూ ఏపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా ఉభయ సభలను అట్టుడికిస్తున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన గురించి చర్చించుకుంటున్నారు. జాతీయ మీడియాలో కూడా ఏపీ ఎంపీల ఉద్యమం, ఆందోళనలు, సస్పెన్షన్ విషయమై చర్చ జరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఏపీ ఎంపీలకు సంఫీుభావం ప్రకటించి, కాంగ్రెస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సోనియా గాంధీ తరహాలోనే పలు పార్టీల నాయకులు కూడా ఏపీ టీడీపీ ఎంపీలకు మద్దతుగా నిలిచారు.
తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా ఏపీ ఎంపీలకు మద్దతుగా ఉంటారు అంటూ ఎంపీ కవిత ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ మరియు తెలంగాణకు ఇచ్చిన హామీను కేంద్రం వెంటనే నెరవేర్చాలని, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్లకుండా ప్రభుత్వం వెంటనే హామీల పరిష్కారంకు సిద్దం అవ్వాలని కవిత కోరడం జరిగింది. నేడు పార్లమెంటులో తెలుగు దేశం పార్టీ ఎంపీలకు మద్దతుగా ఆమె మాట్లాడటం జరిగింది. వ్యవసాయంకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాని, ఎరువులు మరియు రైతులకు కావాల్సిన సామాగ్రిపై రాయితీ ఇవ్వాలని కవిత కోరారు.