అధిష్టాన పెద్దలకే స్పష్టత లేదు : ఎంపీ అనంత

mp anamtaరాష్ట్ర విభజన ప్రక్రియ పై కేంద్రంమంత్రులకు, అధిష్టానం పెద్దలకే స్పష్టత లేదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. దిగ్విజయ్, షిండే చాకో రోజుకో మాట మాట్లాడుతూ.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండి పడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ…విభజనపై మంత్రుల బృందం ( జీవోఎం) ఏర్పాటు తనకు బాధ కలిగించిందని అనంత ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానంపై కేంద్రమంత్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నా సీమాంధ్ర ప్రజల మనోభావాలే తనకు ముఖ్యమన్నారు. హైదరాబాద్, నీటి సమస్యలపై పరిష్కారం చూపకుండా విభజన చేయాలనుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. విభజన ప్రకటన కేంద్రం వెనక్కి తీసుకుంటే తాను చేసిన రాజీనామాపై పునరాలోచించుకుంటానని అనంత వెంకట్రామిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.