మధ్యంతర బెయిల్ పై మోపిదేవి విడుదల

mopidevi-venkataramana1 (1)జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఏడాది మే 24 నుంచి చంచల్ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్న మోపిదేవి శబరిమల వెళ్లేందుకు జనవరి 2 వరకు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జనవరి 3న ఆయన తిరిగి సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. మధ్యంతర బెయిలుపై ఉన్న సమయంలో దర్యాప్తుని ప్రభావితం చేసేవిధంగా ప్రవర్తించరాదని కోర్టు షరతు విధించింది.