Site icon TeluguMirchi.com

జగన్ గూటికి కలెక్షన్ కింగ్?

Mohanbabu to enter YSRCకలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ రోజు మీడియా తో మాట్లాడుతూ… తాను త్వరలోనే ఓ పార్టీ లో చేరుతానని అన్నారు. దేశం లో సరైన నాయకత్వం కరువయ్యిందని, తప్పు చేసేవారికి సరైన శిక్ష విధించగల దమ్మున్న నాయకత్వం కావాలని అన్నారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరే విషయం త్వరలోనే చెబుతానని అన్నారు. తనకు సొంతగా ఓ పార్టీని స్థాపించే ధైర్యం లేదన్నారు. పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే ధైర్యం లేదన్నారు. తాను పదవి కాంక్ష కోసం కాకుండా పార్టీ కోసం ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పుడే రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవలే మోహన్ బాబు జైల్లో ఉన్న జగన్ కలిసిన సంగతి తెలిసిందే. అప్పుటి నుండి.. మోహన్ బాబు జగన్ పార్టీ లో చేరే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈరోజు మోహన్ బాబు చేసిన వాఖ్యాలతో.. ఆయన జగన్ గూటికి చేరేది ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version