Site icon TeluguMirchi.com

స్టాలిన్‌ను సీఎంగా చూడాలి : మోహన్‌బాబు


ముత్తువేల్ కరుణానిధి… తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. అక్టోబర్ 7వ తేదీన కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు. అయితే ఆదివారం కోయింబత్తూరులో స్టాలిన్‌ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆ సంస్మరణ సభ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మోహన్‌బాబు గారు వెళ్లినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు..

కోయింబత్తూరులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభకు నన్ను ఆహ్వానించినందుకు నా సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలు. నేను మీకు అన్ని విధాల శుభం కలగాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను, అని ట్వీట్‌ చేస్తూ స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.

ఇప్పటికే కరుణానిధి మృతి తరువాత డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టడానికి స్టాలిన్‌ సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఆదివారం ఆయన చెన్నైలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇక డీఎంకే కోశాధికారి పదవికి ఆ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.దురై మురుగన్‌ నామినేషన్ వేశారు. ప్రస్తుతానికి ఇక ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో డీఎంకే అధ్యక్షుడుగాపార్టీ శ్రేణులు స్టాలిన్‌ను ఎన్నుకోవచ్చును.

Exit mobile version