అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. #COVID19 కారణంగా ప్రతి ఏడాది లాగే యోగా దినోత్సవాన్ని జరుపుకోలేకపోవచ్చు. కానీ నేటి ఇతివృత్తం ‘క్షేమం కోసం యోగ’ అన్నది ప్రపంచానికి ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. యోగా మనలోని ఒత్తిడిని దూరం చేసి మనల్ని మానసికంగా బలోపేతం చేస్తుంది.
కరోనా వచ్చిన మొదట్లో ఏ దేశం కూడా పోరాటానికి సిద్ధంగా లేదు. కానీ యోగ ద్వారా వైరస్‌తో యుద్ధం చేయొచ్చని తెలుసుకున్నాం. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అందరూ కలిసి యోగా శక్తిని గుర్తించారు. వారు యోగాతో రోగుల రోగనిరోధక శక్తిని బలోపేతం చేశారు. యోగా మరియు దాని ప్రయోజనం చుట్టూ చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి అని అన్నారు.