Site icon TeluguMirchi.com

మోడీ పోకడలు అలాగే ఉన్నాయి

ప్రధాని నరేంద్ర మోడీని 2014 ఎన్నికల్లో దేశ ప్రజలు ఏరి కోరి మరీ పీఎంగా చేశారు. మోడీ ప్రభంజనం ఏ రేంజ్‌లో సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడీ భారీ స్థాయిలో సీట్లు దక్కించుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వచ్చాయి. దాంతో మిత్ర పక్షాలతో మోడీకి పెద్దగా పని లేకుండా పోయింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో బీజేపీ నాయకుల మాటల కంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీల నాయకులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది.

గతంలో వాజ్‌పేయి పీఎంగా ఉన్న సమయంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో చక్రం తిప్పాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఇప్పుడు మోడీ తమ కూటమిలోని పార్టీలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరియు బీజేపీకి పట్టు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే కేంద్రం ప్రేమను చూపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మరింత పెంచేందుకు మోడీ అండ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి రాదు అనుకున్న రాష్ట్రాలను పూర్తిగా పక్కకు పెట్టేసి నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారు.

కాంగ్రెస్‌ నాయకులతో పాటు సాదారణ రాజకీయ విశ్లేషకులు కూడా మోడీ పాలనను నియంత పాలన అంటూ విశ్లేషిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని, కేసుల భయంతో అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని తానై, అన్నింటో తన మాట నెగ్గుకు రావాలనే తత్వంతో మోడీ అన్ని శాఖలపై తన పట్టును చూపిస్తున్నాడు. పార్టీ బలోపేతంతో పాటు, తన ప్రాభవం కనిపించేలా మోడీ వ్యవహరిస్తున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కత్తి మహేష్‌ అన్నట్లుగా ప్రధాని మోడీ నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నాడు.

Exit mobile version