మోడీ ప్రసంగం.. రేపు ఉదయం 10గంటలకు


కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10గంటలకు ఆయన ప్రసంగం ఉంటుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈరోజే ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన మంగళవారం ప్రసంగిస్తారని పీఎంవో స్పష్టంచేసింది. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగింపు అంశంపై రేపే స్పష్టత రానుంది.

ఇదీలావుంటే తెలంగాణలో ఇప్పటికే లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని, ఈ 15 రోజులు పాటు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని వెల్లడించారు.