Site icon TeluguMirchi.com

నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ, కొవిడ్‌ పరిస్థితుల పై ఆరా !

దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు,మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు ఉద్ధవ్‌ ఠాక్రే,ఎంకే స్టాలిన్‌,శివరాజ్‌ సింగ్ చౌహన్‌, జైరామ్ ఠాకూర్‌లకు వేర్వేరుగా ఫోన్‌ చేసిన ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల గురించి చర్చించారు.

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు, తగ్గుతున్న పాజిటివిటీ రేటు గురించి ప్రధానికి వివరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహన్‌ మోదీతో ఫోన్‌ సంభాషణ అనంతరం ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘కరోనా వ్యాప్తి నియంత్రణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక మహారాష్టకు మరింత ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ప్రధానిని కోరారు.

Exit mobile version