మోడీ @ 24 గంటలు ఆన్ లైన్లో


తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వున్నా తనతో చెప్పాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోడీ. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.

అందరు కలిసి పనిచేస్తేనే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాగా చాలా మంది సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.