ఓ కొత్త శకం మొదలైయింది : మోడీ

జీఎస్టీ కేవలం ఆర్థిక సంస్కరణలకే కాదు.. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియ. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ గొప్ప ఉదాహరణగా నిలవబోతోంది. ఈ కొత్త వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకో, వ్యక్తులకో చెందినది కాదు. ఇది అందరి విజయం” అన్నారు ప్రధాని నరేంద్రమోడీ.

పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో ఏర్పాటు చేసిన జీఎస్టీకి స్వాగత కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ మరి కొన్ని క్షణాల తర్వాత దేశం కొత్తదారిలో నడిచేందుకు సిద్ధంగా ఉందని, అనేక చర్చోపచర్చల అనంతరం ఏర్పాటైన వ్యవస్థ జీఎస్టీ అని, అఖిలపక్ష వాదనల నుంచి మధ్యేమార్గం ఎంచుకుని జీఏస్టీ ఏర్పాటైందని, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్లే .. జీఎస్టీ కోసం 18 సమావేశాలు జరిగాయని, మరి కొద్దీ క్షణాల్లో దేశంలో కొత్త యుగానికి స్వగతం పలుకుతుందని వ్యాఖ్యానించారు మోడీ.