ప్రధాని మోడీ మరో టాస్క్

ప్రధాని మోదీ తాజాగా మరో టాస్క్‌ ఇచ్చారు. ఐతే ఇది భాజపా కార్యకర్తలకు మాత్రమే. నేడు భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్‌పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.