ఒకే వేదికపై ’ముగ్గురు మొనగాళ్లు’.. !

pawan-chandrababu-modi

భావి భారత ప్రధానికిగా భావిస్తున్నవారు ఒకరు. పాలించిన 9యేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించిన నేత మరొకరు. దేశాన్ని అవినీతి నుంచి కాపాడాలంటూ.. ’కాంగ్రెస్ హఠావో దేశ్ కో బచావో’ నినాదాన్ని ఇచ్చిన నయా పార్టీ యువతనేత ఇంకొకరు. ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. వీరే.. భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీరి లక్ష్యం కూడా ఒక్కటే.. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాటికి పంపించడమే. తెలంగాణలో మోడీ సుడిగాలి పర్యటన భాగంగా ఈ ఆసక్తికరమైన కలయిక జరగబోతోంది.

ఆసక్తిని కలిగించే ఈ త్రయం కలయికకు వేదిక హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కానుంది. ఈరోజు సాయంత్రం 6గంటలకు జరిగే ఎల్బీనగర్ స్టేడియం వేదిక జరగనున్న ’భారత్ విజయ యాత్ర’ సభలో మోడీ, బాబు, పవన్ పాల్గొననున్నారు. అయితే, అంతకుముందు మోడీ నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌ నగర్‌ సభలలో ప్రసగింస్తారు. వీటిలో మోడీతో పాటుగా మహబూబ్ నగర్ సభకు చంద్రబాబు, నిజామాబాద్ సభకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. చివరగా సాయంత్రం ఎల్బీనగర్ స్టేడియంలో జరిగే సభకు మాత్రం త్రిమూర్తులు పాల్గొననున్నారు.