Site icon TeluguMirchi.com

మోదీ- కేటీఆర్ భేటీ ముగిసింది..

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రధాన మంత్రి మోదీ తో సమావేశమై పలు అంశాల ఫై మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ భేటీ లో ప్రదానంగా విభజన హామీలతో పాటు ఐటీఐఆర్ ఏర్పాటుకు సహకరించి.. ఆ పనులు మరింత వేగవంతం చేయాలని కోరినట్లు సమాచారం. అలాగే ప్రైవేటు పెట్టుబడులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని.. ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తే మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా , తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేయూతనిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని , మోడీతో కేటీఆర్ మాట్లాడినట్లు తెలిపారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం అంశంలో ఇటీవలే ప్రధాని మరింత సమాచారం అడిగారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ప్రధానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 15 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని మరోసారి ప్రధాని మోదీకి గుర్తు చేసినట్లు కేటీఆర్ మీడియా కు తెలిపారు.

Exit mobile version