జలియన్ వాలాబాగ్ ఊచకోతలో మరణించిన అమరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు ‘ఇదే రోజున జలియన్ వాలాబాగ్‌లో ఊచకోతకు గురైన అమరులకు నమస్కరిస్తున్నాను. వారి ధైర్యసాహసాలు, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోం. రాబోయే తరాలకు వారి శౌర్య ప్రతాపాలు స్ఫూర్తినిస్తాయి’ అని ట్విటర్ వేదికగా ప్రధాని నివాళులు అర్పించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో దేశంలో 796 కరోనా పాజిటివ్ కేసులు, 35 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308కి చేరింది.