ప్రధానమంత్రి నరేంద్రమోదీని సాయం కోరారు గా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి. కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కాగా రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు స్వీయ సామాజిక దూరం పాటించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బూత్‌స్థాయి క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు జగన్ పలు బాధ్యతలు అప్పగించారు