Site icon TeluguMirchi.com

ఏపీ, తెలంగాణ, జమ్ముకశ్మీర్‌లలో ఒకేసారి ఆ పని చేయబోతున్న కేంద్రం

ఏపీ పునర్విభజన చట్టంలో కీలకంగా ఉన్న అసెంబ్లీ సీట్ల పెంపును కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం మొదటి అయిదు సంవత్సరాలు అసలు ఆ విషయాన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎమ్మెల్యేలను పెంచాలంటూ విజ్ఞప్తిని చేయడం జరిగింది. కాని మోడీ ప్రభుత్వం మాత్రం అసలు ఏమాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవలే జమ్ము కశ్మీర్‌ నుండి లడఖ్‌ను విభజించడం జరిగింది. దాంతో విభజన చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి ఉంది. సున్నితమైన ఇష్యూ కనుక వెంటనే జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించిన నిర్ణయంను తీసుకోబోతున్నారు. ఇదే సమయంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపును కూడా చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంకు ఏపీలో కొత్త అసెంబ్లీ స్థానాలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కొత్తగా అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి.

Exit mobile version