కొద్దిసేపటి క్రితం జాతినుద్దేశింది మాట్లాడిన ప్రధాని మోడీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. ఇకనుండి కరోనా వాక్సిన్ కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు, రాష్ట్రాలకు ఉచితంగా వాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారుచేస్తున్నాయి, మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి అన్నారు. జూన్ 21 నుండి 18 సంవత్సరాల పైబడ్డ వారందరికీ ఉచితం వాక్సిన్ అందచేస్తామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి 25 శాతం వాక్సిన్ తీసుకోవడానికి అనుమతిచ్చినట్లు తెలిపారు, అంతే కాకుండా వాక్సిన్ కి 150 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదని ఆదేశించారు. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న కార్యక్రమాన్ని మరికొన్ని నెలలు కొనసాగిస్తామన్నారు.