రిజర్వేషన్స్‌కు ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుండి కూడా వ్యతిరేకంగానే ఉంది. గతంలోనే ఆర్‌ఎస్‌ఎస్ చీప్ మోహన్ భగవత్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్స్‌ను పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా మరోసారి ఆయన మాట్లాడుతూ తాను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాని రిజర్వేషన్లు అనేవి కరెక్ట్‌గా అమలు అవ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండే మోడీ ఈ రిజర్వేషన్ల గురించి ఏమైనా సాహస నిర్ణయం తీసుకుంటాడా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మోడీ ప్రభుత్వం కనుక రిజర్వేషన్లు రద్దు చేస్తే చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. అదే సమయంలో వెంటనే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే మెల్ల మెల్లగా రిజర్వేషన్లు రద్దు చేయాలనే సలహాలు అందుతున్నాయి.