స్వాతంత్య్రం వచ్చినప్పటిన ఉండి ఇండియాలో రిజర్వేషన్స్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మన రాజ్యాంగంలో రిజర్వేషన్స్‌ను ప్రవేశ పెట్టారు. అప్పట్లో ప్రజల మద్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. కులాలు మరియు మతాల అంటూ ప్రజల మద్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించే ఉద్దేశ్యంతో అంబేద్కర్ కింది స్థాయి వారికి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదని, ఇలాంటి సమయంలో ఇంకా రిజర్వేషన్స్ కొనసాగించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ చాలా కాలంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రిజర్వేషన్స్‌కు ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా వ్యతిరేకంగానే ఉంది. గతంలోనే ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్స్‌ను పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా మరోసారి ఆయన మాట్లాడుతూ తాను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాని రిజర్వేషన్లు అనేవి కరెక్ట్‌గా అమలు అవ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండే మోడీ ఈ రిజర్వేషన్ల గురించి ఏమైనా సాహస నిర్ణయం తీసుకుంటాడా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మోడీ ప్రభుత్వం కనుక రిజర్వేషన్లు రద్దు చేస్తే చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. అదే సమయంలో వెంటనే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే మెల్ల మెల్లగా రిజర్వేషన్లు రద్దు చేయాలనే సలహాలు అందుతున్నాయి.