Site icon TeluguMirchi.com

మోడీతో సుజన భేటీ.. పెదవి విరుస్తున్న జనాలు

బడ్జెట్‌ కేటాయింపుల్లో కొత్త రాష్ట్రం అయిన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత రెండు రోజులుగా ఎంపీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు లోపల మరియు బయట చేస్తున్న ఆందోళనలతో మోడీ దృష్టిలో పడ్డారు. ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలను విరమింపజేసేందుకు మోడీ సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎంపీల తరపున మంత్రి సుజనా చౌదరిని మోడీ చర్చలకు ఆహ్వానించడం జరిగింది. సుజన చౌదరితో మోడీ దాదాపు 20 నిమిషాలు భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో సుజన చౌదరి రాష్ట్రంకు సంబంధించిన పలు సమస్యలను మోడీ వద్ద ప్రస్థావించినట్లుగా తెలుస్తోంది.

టీడీపీ ఎంపీలు అంతా కూడా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన మంత్రి సుజన చౌదరిని చర్చలకు పిలవడం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటకు చూడ ఏపీకి ఏదో న్యాయం చేస్తామని, ఎంపీల కృషి ఫలించిందని అనిపించేందుకు ఈ భేటీ ఉందని అంటున్నారు. సుజనా చౌదరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి న్యాయం చేయాలని మోడీని గట్టిగా ప్రశ్నించలేడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 20 నిమిషాల భేటీలో ప్రధానితో ఏం మాట్లాడాడు అనే విషయంపై సుజనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Exit mobile version