ఈ ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి.”అని ప్రధాని మోడీ పిలుపినిచ్చారు. ” ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. మనం నిరంతరం ప్రకాశం వైపు సాగాలి. ఈ ఆదివారం ఏప్రిల్ 5న మనం అందరం కలిసి కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమికొట్టాలి.” అన్నారు
130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని మరింత ఘనంగా చాటుదాం. ఈ ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి. ఆ ప్రకాశంలో మన మనసులో నేను ఒంటరిని కాదు అనే సంకల్పం చేసుకోవాలి. ఈ కార్యక్రమం జరిగినంత సేపు.. ఎవరూ రోడ్లపైకి రావొద్దు. మీ అమూల్యమైన సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ” అని చెప్పారు