‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్ చేశారు. ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని తెలిపారు చంద్రబాబు
కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్‌డౌన్‌తో కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నామని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఆర్థిక వ్యవస్థకు ఇదో పెను సవాల్‌గా మారింది. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుటే లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి. కరోనాతో అగ్రదేశాలూ అతలాకుతలమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కట్టడి చేయగలుగుతున్నాయి.. మరికొన్ని సమర్థంగా చేయలేకపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం’ అన్నారు.