కరోనా పై విజయానికి మోడీ చెప్పిన 7 సూత్రాలు

దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇదే సందర్భంలో కరోనాపై విజయం సాధించడానికి సప్త సూత్రాలు పేరిట ఆయన 7 సూత్రాలను ప్రజలకు వివరించారు.

* ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి , లాక్‌డౌన్‌, సోషల్ డిస్టెన్స్ పాటించాలి
* ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలి.
* రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అవసరమైన ఆహారం, వేడి నీళ్లు తీసుకోవాలి.
* ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని నిరంతరం సమాచారం తెలుసుకోవాలి.
* పేదలు, నిర్భాగ్యులు ఆకలితో అలమటించకుండా సమాజం ముందుకొచ్చి ఆదుకోవాలి.
* పరిశ్రమలు, సంస్థల్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసివేయవద్దు.
* వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పట్ల గౌరవంతో వ్యవహరించాలి.