మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

కరోనా కట్టడికై మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటిఆర్ ట్యాంక్ బండ్ పై ప్రారంభించారు. అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు. మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తొలి విడత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు వెల్లడించారు. మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. లార్డ్స్ చర్చితో పాటు వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సంయుక్త సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.