ఆ పాపం నాకు వద్దు

ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం టీడీపీ, బీజేపీల మద్య విభేదాల గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా బీజేపీ నాయకుడు, ఎమ్మెస్సీ సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇతర బీజేపీ నాయకులు కూడా టీడీపీ తీరును తప్పుబడుతున్నారు. అయితే వీర్రాజు మాత్రం కాస్త ఎక్కువ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పిస్తున్నాడు. టీడీపీ తమకు మిత్రపక్షం అనే భావన లేకుండా వీర్రాజు విమర్శలు గుప్పిస్తున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నాడు.

వీర్రాజు వ్యాఖ్యలు మరియు విమర్శల కారణంగానే ఏపీ మరియు కేంద్రంలో టీడీపీ, బీజేపీల మద్య పొత్తు విచ్చినం అవ్వడం ఖాయం అంటూ కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యల వల్ల, తన వల్ల టీడీపీ, బీజేపీ పొత్తు విచ్చినం కాదని, టీడీపీ వారు ఏపీలో మోడీని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే తాను టీడీపీని విమర్శిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పొత్తు విచ్చిన్న పాపంను మాత్రం తన నెత్తిన వేసుకునేందుకు వీర్రాజు సిద్దంగా లేడని ఆయన మాటలతో అర్థం అయ్యింది.