అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏదోలా గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఆ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి. భవిష్యత్తులో వైకాపా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇలాంటి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం లేదా ఓట్లను కొనుగోలు చేయడం చేస్తుంది. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు సీటు వదులుకోవాలని ఏ ప్రభుత్వ అధినేత అయినా భావించడం చాలా కామన్.
అలాగే తెలుగు దేశం పార్టీ కూడా కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం బలాన్ని ఉపయోగించుకుని ఉంటుంది. స్థానిక సంస్థల నాయకులను ఎలా, ఏం చెప్పి ఒప్పించారో కాని మొత్తానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించాడు. కడపలో తెలుగు దేశం జెండా పాతి తెలుగు దేశంకు జై కొట్టించాడు. అయితే ఈ ఓటమిని ఒప్పుకోలేని జగన్ మాత్రం విమర్శలు చేస్తున్నాడు.