ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రోహిత్ రెడ్డి, ప్రభుత్వం అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది.

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో ఉంచాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించడంతో సిబిఐ దర్యాప్తుకు మార్గం సుగమం అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.