Site icon TeluguMirchi.com

మైనర్ బాలికపై లైంగిక దాడి, యువకుడిపై పోక్సో కేసు నమోదు..


రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. కూతురుకు దెయ్యం పట్టిందని రేణిగుంట లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామిజీని పేరెంట్స్ ఆశ్రయించగా అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి స్వామి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన విషయాన్ని పేరెంట్స్ కాకుండా, తను ప్రేమించిన మహమ్మద్ రఫీ అనే యువకుడికి బాలిక చెప్పడంతో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆశ్రమం నుంచి మహమ్మద్ షఫీ ఆ బాలికను తీసుకెళ్లగా కూతురు కనిపించలేదని గాజుల మండ్యం పిఎస్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి మహమ్మద్ షఫీ తో పాటు మరో ఇద్దరి యువకులను అరెస్ట్ చేసారు. మహమ్మద్ షఫీ, ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామీజీ లపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న మూర్తి స్వామి.

Exit mobile version