నాకు మందు అలవాటే లేదు, వారిపై కేసు పెట్టాను

హైదరాబాద్‌లో తాజాగా జరిగిన బోనాల ఉత్సవంలో భాగంగా తలసాని శ్రీనివాస్‌ మరీ తాగి ఎక్కువ డాన్స్‌ చేశాడు అంటూ ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మందు బాబులం మేము మందు బాబులం అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌ పాట వస్తుంటే దానికి అనుగుణంగా తలసాని డాన్స్‌ వేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాంతో ఆ వీడియో చాలా వైరల్‌ అవ్వడంతో ఏకంగా తలసాని శ్రీనివాస్‌ స్పందించాడు. తాజాగా మంత్రి మీడియా ముందుకు వచ్చి ఆ వీడియో మార్ఫింగ్‌ అంటూ చెప్పుకొచ్చాడు.

నాకు మందు అలవాటే లేదు. అలాంటి నేను తాగి డాన్స్‌ వేసినట్లుగా క్రియేట్‌ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్‌ పోలీసులను కోరడం జరిగింది. కేసు నమోదు చేసిన వారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. సోషల్‌ మీడియాలో ఇలాంటి ప్రచారం చేయడం వల్ల ప్రముఖుల పరువులు పోతున్నాయి. గతంలో పలువురు ఇలా జరగడంతో పరువు పోగొట్టుకున్నారు. తాజాగా ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్‌కే ఎసరు పడింది. అందుకే ఆయన సీరియస్‌ అయ్యాడు.