ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేలకు పైగా కరోనా బారిన పడగా ..తాజాగా మంత్రి శంకర్ నారాయణ కుటుంబంలో ముగ్గురు కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది.
అనంతపురం జిల్లా ధర్మవరంలో నివసిస్తున్న శంకర్ నారాయణ మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఈమె శనివారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందని భావించినా చివరి నిముషంలో ఎందుకైనా మంచిదని అనుమానంతో అధికారులు మంత్రి, ఆయన కుటుంబసభ్యులకు కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా నెగిటివ్ వచ్చినా ఆయన కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ధర్మవరంలో మంత్రి నివసిస్తున్న సాయినగర్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.