తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీడిరి అప్పలరాజు, తిరుపతి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల నిధులతో గ్రంథాలయాన్ని, 9 లక్షలతో డిజిటల్ మినీ సెమినార్ హాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ లైబ్రరీ నుండే సెమినార్ హాల్ ద్వారా రైతులకు నేరుగా పాఠాలను చెప్పే సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.