Site icon TeluguMirchi.com

‘తెలంగాణ’తో మావోయిస్టుల సమస్య!

sailajanath-ministerముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై కోర్ కమిటీకి ఇచ్చిన రోడ్మ్యాప్ నివేదికలో ఏముందో తనకు తెలియదంటూనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే మావోయిస్టు సమస్య ఉత్పన్నం కావడం ఖాయమని ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్. శైలజానాథ్ అనంతపురంలో స్పష్టం చేశారు.

మంత్రి శైలజానాథ్ ప్రత్యేక తెలంగాణ అంశం పై ఈ రోజు అనంతపురం జిల్లాలో మాట్లాడుతూ… రాయల తెలంగాణ ప్రతిపాదన కేవలం ఊహాగానాలే అని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులు సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ కార్యకర్తగా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. 2002లో సీడబ్ల్యూసీ సమావేశం రెండో ఎస్పార్సీని తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పడు కూడా రెండో ఎస్సార్సీపైనే చర్చ జరగుతుందని అన్నారు.

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై కోర్ కమిటీకి ఇచ్చిన రోడ్మ్యాప్ నివేదికలో… ఇప్పుడు దేశంలో ఉన్న మావోయిస్ట్ కమిటీలకు సారధ్యం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆంద్రప్రదేశ్ కు చెందినవారేనని, అందులో తెలంగాణకు చెందినవారే అధికమని.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే.. మరోసారి వారు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు ఓ వార్త వినిపించిన సంగతి తెలిసిందే.

Exit mobile version