తిరుమల శ్రీవారిని ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.