ఢిల్లీలో కిషన్‌ రెడ్డికి ఇల్లు లేక అవస్థలు

తెలంగాణ బీజేపీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి అయిన కిషన్‌ రెడ్డి ఢిల్లీలో సొంతంగా అధికారిక నివాసం లేకపోవడంతో ఢిల్లీలో ఉండే తెలంగాణ భవన్‌ నుండి విధులను నిర్వర్తిస్తూ ఉన్నాడు. తెలంగాణ భవన్‌ నుండి తన కార్యక్రమాలను నిర్వర్తించడం వల్ల ఇబ్బంది కలుగుతుందని కిషన్‌ రెడ్డి భావిస్తున్నాడు. అయితే ఇప్పటికే కిషన్‌ రెడ్డికి అధికారిక భవనం కేటాయించడం జరిగింది. మంత్రి హోదాలో ఉన్న కిషన్‌ రెడ్డికి ఆ స్థాయి అధికారిక నివాసం కేటాయించారు. అయితే ఆ భవనంలో జశ్వంత్‌ సిన్హా ఉంటున్నారు. ఆయనకు మరో అధికారిక నివాసం కేటాయించినా అందులో మరొకరు ఉన్న కారణంగా ఆయన ఖాళీ చేయడం లేదు.

జశ్వంత్‌ సిన్హా ఖాళీ చేస్తే కిషన్‌ రెడ్డి ఆ అధికారిక నివాసంలోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే పలు సార్లు జశ్వంత్‌ సిన్హాకు నోటీసులు అందించడం జరిగింది. ఆయన బీజేపీ నాయకుడు అవ్వడం వల్ల కిషన్‌ రెడ్డి కూడా సరే అనుకుంటూ తెలంగాణ భవన్‌లో తన అధికారిక పనులు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ భవనానికి నీళ్లు మరియు కరెంట్‌ కట్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికైనా జశ్వంత్‌ సిన్హా ఆ అధికారిక భవనంను ఖాళీ చేసి కిషన్‌ రెడ్డికి ఇస్తాడేమో చూడాలి.