Site icon TeluguMirchi.com

మంత్రి కన్నబాబు ఇంట విషాదం…!

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో గురువారం ఉదయం సురేష్ కన్నుమూశారు. ఈయన కన్నబాబుకి పెద్ద తమ్ముడు. మరో తమ్ముడు కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

కురసాల సురేష్ గతంలో విశాఖపట్నంలో ‘ఈనాడు’ రిపోర్టర్‌గా పని చేశారు. తర్వాత జర్నలిజం వృత్తిని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు. సోదరుడి మృతదేహంతో పాటు కన్నబాబు కాకినాడ వెళ్తున్నారు. మంత్రి కన్నబాబు సోదరుడి హఠాన్మరణం పై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Exit mobile version