Site icon TeluguMirchi.com

మనీ ల్యాండరింగ్ పై మంత్రి వివరణ !

Mistake-Is-Mistake--Mr-Parthasarathy----136మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై మంత్రి పార్థసారధి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఈరోజు (గురువారం) మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ప్లాస్టిక్ కంపోస్ట్ తయారీ పరిశ్రమకు యంత్ర సామగ్రిని స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. దీనికోసం ముందుగా 15శాతం డబ్బు చెల్లించేలా స్విస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మిగతా 85 శాతం డబ్బును ఐదేళ్లపాటు విడతలవారీగా చెల్లించేలా ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు.

ఆరు నెలల తరవాత మిగిలిన 85 శాతం డబ్బు ఆంధ్రాబ్యాంకు ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉందని, అయితే ఆంధ్రాబ్యాంకు మిగతా 85 శాతం చెల్లించేందుకు తిరస్కరించిందని మంత్రి చెప్పుకొచ్చారు. సమయానికి డబ్బు చెల్లించని కారణంగానే ముందు చెల్లించిన సొమ్మును స్విస్ కంపెనీ జప్తు చేసుకుందని మంత్రి తెలిపారు. అయితే ముందుగా చెల్లించిన 60 లక్షల రూపాయల మొత్తాన్ని ఆర్బీఐ అనుమతి తోనే పంపించినట్టు పార్థసారధి వివరించారు.

Exit mobile version