ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అమరావతిని భారీగా నిర్మించడం పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. అసలు అమరావతిని రాజధానిగా ఉంచడం కూడా కొందరు వైకాపా నాయకులకు ఇష్టం ఉన్నట్లుగా అనిపించడం లేదు. వైకాపా నాయకులు స్వయంగా అమరావతి కాకుండా రాజధానికి కొత్త ప్రాంతంను ఎంపిక చేయాలని అంటున్నారు. తాజగా ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి రాజధాని విషయంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలతో రాజధాని విషయంలో మరింత సందిగ్దం నెలకొంది.
తాజాగా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం అంటూ అభివృద్ది అంతా ఒక్క ప్రాంతంకు కేంద్రీకృతం చేయాలని భావించడం లేదు. రాష్ట్రం మొత్తం అభివృద్ది చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నిర్మాణంకు ప్రస్తుతానికి నిధులు లేవు. రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ది చేసే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. అభివృద్ది అందరికి సమానంగా అందండంతో పాటు, అందరికి సుస్థిర జీవితంను కలిగించేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బుగ్జన పేర్కొన్నాడు. ఈ విషయమై అదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్పందిస్తూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుకుంటే ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామంటూ చెప్పుకొచ్చాడు.